నేను బీ టెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ప్రతి విద్యార్ధి లాగానే నేను కూడా ఇంజనీరింగ్ లో చేరేటప్పుడు ఎన్నో ఆశలు, ఆశయాలతో చేరాను. కాని చేరాక కాలేజీలలో పరిస్తితులు చూస్తే వాస్తవానికి చాల భిన్నంగా ఉన్నాయి. విద్యార్ధులకు చదువు ఏ విధంగా నేర్పాలో తెలియని యాజమాన్యాల చేతిలో ఎంతో పేరు ఉన్న, స్థాపించి ఎన్నో ఏళ్ళు గడిచిన కాలేజీలు ఉన్నాయి. వీటి వల్ల “వృత్తి రీత్యా కోర్సులు” అనే పేరుకే మాయని మచ్చ పడుతోంది. ప్రపంచం మొత్తం మీద ఎన్ని చదువులు వున్నా, ఇంజనీరింగ్ కన్నా ప్రాణాలు పోసే డాక్టర్ వంటి ఎంతో ఉన్నతమైన చదువులు ఉన్నా కూడా, కేవలం ఇంజనీరింగ్ కోర్సులను మాత్రమె ప్రొఫెషనల్ కోర్సులు అంటారు. దీనికి కారణం, చదువు పూర్తిచేసుకునే సమయానికి విద్యార్ధి, రియల్-టైం సమయాలలో తనకి ఉన్న పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రాబ్లం కి ఆన్సర్ ను కనుగొనే విధముగా ట్రైన్ చేయబడతాడు అనే ఒక ఐడియా తో మాత్రమె. అదే డాక్టర్ ని కనుక పరిశీలించినట్లయితే, చదువు పూర్తీ చేసాక కూడా, తన వయసు పెరిగే కొద్ది అతని అనుభవం పెరుగుతుంది. చదువు పూర్తీ చేసిన వెంటనే ఎం బీ బీ ఎస్ విద్యార్ధి ఆపరేషన్ చేయలేడు కదా.
ఇంతటి మంచి ఉద్దేశం ఉన్నటువంటి ఇంజనీరింగ్ కోర్సును బోధిస్తాము అంటూ వందల కొద్ది ఇంజనీరింగ్ కళాశాలలు పుట్టుకోచేసాయి. పోటి ని తట్టుకుని విద్య అనే వ్యాపారం లో రానిన్చటానికి ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన కళాశాలలు కూడా విద్యను బోధించటం లో ఉండే క్వాలిటీ ని తగ్గించేసి ఇన్ టేక్ పెంచేసి, విద్యాబోధన మీద కన్నా కూడా ధనార్జన మీద దృష్టి పెడుతున్నాయి.
Q : “నువ్వు కట్టే ముష్టి ముప్పె వేల కి నువ్వు కొరుకున్న వన్ని అచీవ్ చెయటం కష్టం!!!! నీకు అంత టాలెంట్ ఉంటే IIT లో సీటు తెచుకొవచ్చు కద.!! ”
A : ఏ? ఐ ఐ టిలలోనే క్వాలిటీ ఉన్న ఇంజినీర్లు తయారవ్వలా? దేశం లో కేవలం ఆ 9000 మంది మాత్రమే ఉన్నారా? మన రాజ్యాంగం ప్రకారం ప్రతి విద్యాసంస్థ నాణ్యమైన విద్య ను ఇవ్వాలి.. అలంటి విద్యను ఆశించడం ప్రతి విద్యార్ధి హక్కు కూడా. స్టూడెంట్స్ యొక్క జీవితాలతో ఆడుకునే హక్కు ఏ విద్యాసంస్థ కు ప్రపంచం లో ఎక్కడా లేదు.
Q : ఎ నిన్ను నాణ్యమైన విధ్యా సంస్థ లో ఎవరైనా చేర కుండా ఆపారా….. నాణ్యత విద్యా సంస్థ లో ఉన్నా నాణ్యత లేని students ఉంటే ఎమి లాభం
A : అందుకే కదా స్టూడెంట్స్ కూడా అలానే ఉన్నారు అని రెండవ బ్లాగు పోస్ట్ రాసింది.
ఇలాంటి నిప్పు లాంటి నిజాలను బయటపెట్టి, ఎవరు గొంతు విప్పని సమయంలో ధైర్యంగా వ్యాసాలు రాయటమే ఈ బ్లాగు లక్ష్యం.