AP EAMCET 2010 .::. Blog

మేమేమన్న తక్కువ తిన్నామా? ఇది విద్యార్ధిని విద్యార్ధుల పరిస్థితి
నిన్నటి మన బ్లాగులో కొన్ని “చెత్త”కళాశాలల గురించి ప్రస్థావిన్చాము. సరే వాటి సంగతి అలా ఉంటే, మరి మన పిల్లలు సరిగ్గా ఉన్నారంటారా?

ఒక విధముగా చెప్పాలంటే, విద్యార్ధులు కూడా కళాశాలలకు మాదిరిగానే అద్వానమైన పనులు చేస్తూ వారిని కన్నా తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నారు.

ఇక్కడ నా సొంత కళాశాల పరిస్తితిని వివరించడం కరెక్ట్ అనిపించి, రాస్తున్నాను.

చెప్పుకోవడానికి మా ప్రాంతంలోనే మంచి కాలేజీ మాది. కాని ఇక్కడ చేరే పిల్లలు మాత్రం ఎక్కువ శాతం ఇందుకు భిన్నంగా ఉంటారు. కేవలం మేనేజ్మెంట్ కోటా లో చేరే విద్యార్ధులే కాకుండా, మంచి మంచి రాంకులు సంపాదించి ఈ కళాశాలలో సీటు సంపాదించినవారు కూడా, కాలం కదిలే కొద్దీ, చెడు అలవాట్లకు బానిసలూ అయ్యి, తమ చదువును భవిష్యత్తును చెదగోట్టుకోవటమే కాకుండా, పరుల జీవితాలను కూడా కష్టాల కొలిమిలోకి ఈడుస్తున్నారు.

ఒకడు క్లాసు లోనే గుత్క నమిలితే, ఇంకొకడు రూం లో కుర్చుని మందు కొట్టే వరకు వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఏదో ఫైనల్ ఇయర్ విద్యార్ధులు చేస్తున్న పనులు కాదు, కేవలం మొదటి సంవత్సరం లో చేరే విద్యార్ధుల పరిస్థితి మాత్రమే. ఇంకా ఫైనల్ ఇయర్ వలల్ గురించి చెప్పవలసిన వసరం లేదని నా ఉద్దేశం.

స్టూడెంట్స్ ఎలా తయారయ్యారంటే, కాలేజీ కి వచెది వారి చదువులకోసం కన్నా కూడా ఎక్కువ టైం పాస్ కోసమో లేక ఇంట్లో ఏదో బలవంతం చేయటం కారణంగానో మాత్రమే. అమ్మాయిలేమి తక్కువ తినలేదు. వాళ్ళు చేసే ప్రతి పని ఎవర్నో ఆకర్షిద్దాము, లేక వేరే ఇతర ఆలోచనలతో మాత్రమే. ఎక్కడో ఒకరో ఇద్దరో కొంచం లిమిట్స్ లో తమ ఇంజనీరింగ్ చదువును ఒక పక్క ఎంజాయ్ చేస్తూ, కొత్త విషయాలను తెల్సుకుంటున్నారు. ఇవన్ని కొంచం కటినంగా అనిపించి ఉంటే, ఒక పని చేయండి. మీ ఇంటి పక్కనో లేక మీ బంధువులలో ని ఇంజనీరింగ్ విద్యార్ధి/విద్యార్ధిని ని అడిగి వాస్తవాలను తెల్సుకునే ప్రయత్నం చేయండి.

అసలా విద్య ని అభ్యసించాల్సిన వల్లే ఇలా వస్తుంటే కాలేజీలకు, ఇంకా యాజమాన్యాలకు, వారి వారి పనులు సులభమయిపోతున్నాయి. గట్టిగ ప్రశ్నించే వారే లేకపోవడంతో రాను రాను విద్య బోధనా లోని క్వాలిటీ ని తగ్గించేస్తున్నాయి కళాశాలలు. నిజంగా చెప్పాలి అంటే ఐ ఐ టీ లకు మన రాష్ట్రంలోని అనేక కళాశాలలకు ఉన్న ఒకే ఒక్క తేడ, విద్యార్ధులు సరిగ్గా లేకపోవటం, అది అదునుగా చేసుకుని యాజమాన్యాలు పిల్లల జీవితాలతో ఆడుకోవటం. మరి పిల్లలు ఎందుకు సరిగ్గా లేరు అనేదానికి కొంతవరకు వారి స్కూల్ , ఇంటర్ కాలేజీల వ్యవస్థలను కూడా చర్చించాలి. ఈ మద్య, ఐ ఐ టి కోచింగుల పేరుతో 6వ తరగతి నుండే పిల్లలను ట్రైన్ చేస్తాము అని ప్రతి స్కూల్ మొదలుపెట్టింది. అసలు న్యూటన్ సిద్ధాంతము యొక్క బోధనా జరిగేది 6వ తరగతిలో అయితే, మరి సిద్దాతము నేర్చిన వెంటనే, దాని మీద పెద్ద పెద్ద లెక్కలు చేయించటం ఎంతవరకు కరెక్ట్? కేవలం ఐ ఐ టిల పేర్లు చెప్పుకుని, స్కూళ్ళు తల్లిదండ్రుల వద్ద లక్షల కొద్ది డబ్బులు డిమాండ్ చేస్తున్నాయి. పోనీ ఆ చెప్పే చదువు క్వాలిఫైడ్ స్టాఫ్ తో చెప్పిస్తున్నారా అంటే అదీ లేదు. అప్పుడే డిగ్రీ పాస్ అయిన వారితో చెప్పిస్తున్నారు. వాళ్లకేమో పిల్లలకు సున్నితంగా విద్య బోధనా చేయటం చేతకాక, కొట్టడాలు, తిట్టడాలు చేస్తూ ఉంటారు. ఒక్క చిన్న సమాధానం చెప్పకపోతేనే ఏదో పెద్ద సంపాదన పోగొట్టుకున్నంత పనులు చేస్తారు.

ఇక ఇంజనీరింగ్ కాలేజీల విషయానికొస్తే, ఆయా యాజమాన్యాల దృష్టి ధనార్జన, ర్యాంకులు, మార్కుల మీదనే కాని, పిల్లలకి ఇంకా మెరుగైనటువంటి శిక్షణ ఎలా ఇస్తే బాగుంటుంది, ఇంకా ప్రాక్టికల్ గా, ఇంకా న్యాచురల్ గా ఎలా బోధించాల అనే విషయం పైన అస్సలు లేదు. పరీక్షా ఫలితాలు విడుదల కాగానే పేపర్లు, టీవీ చానల్స్ లో తెగ ప్రకటనలు చేయడం, ఏదో కొత్త వ్యాపారానికి చేసినట్టు.

ఇలాంటి చెత్త ఫౌండేషన్ ఉన్న విద్యార్ధులు ఇంజనీరింగ్ లో రౌడీలు, గుండాలు, ఎందుకు పనికిరాని వారిగా కాకపోతే ఇంకెలా తయారవుతారు? అసలు ఎం పని చేస్తున్నాడో తనకే తెలియని స్థితిలో ఉంటారు 95% విద్యార్ధులు. ఈ మాటలు కొంచం కటినంగా ఉన్న ఇవి కరుడుగట్టిన నిజాలు.

విద్యార్ధినీ విద్యార్ధులకు ఒక సూచన :

.::. మీకు స్కూల్ లో కాని ఇంటర్ కాలీజిలో కాని తగిన స్వేచ్చ ఇవ్వలేదు అనేది వాస్తవం. కాని మీకు ఇంజనీరింగ్ లో చాల ఫ్రీడం ఇస్తారు. దయచేసి దానిని దుర్వినియోగిన్చుకోకండి. కొంతమంది విద్యార్ధులు దానిని దుర్వినియోగించడం వాళ్ళ, ఈ రోజుకే కొన్ని కాలేజీలలో, మల్లి స్కూలు, ఇంటర్ వాతావరణం నెలకొని ఉంది. దీనివల్ల మీరు స్వేచ్చ ను ఎంజాయ్ చేయలేరు., ఏదో నేర్చుకుందాము, ఏదో చేద్దాము అని వచ్చే విద్యార్ధులకు కూడా మీరు అడ్డంకిగా మారిపోతారు. దయ చేసి అలంటి పరిస్థితులు తీసుకురాకండి.

తల్లిదండ్రులకు ఒక చిన్న మనవి :

.::. మీరు మీ పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండటం మంచిది. పిల్లవాడు/అమ్మాయి స్నేహితులు ఎలాంటి వారు.. కాలేజీలో ఎవరెవరితో ఎక్కువగా ఉంటున్నారు… మార్కులు ఎలా వస్తున్నాయి.. క్లాస్సులకు వస్తున్నారా.. వంటి అంశాలపయిన దృష్టి పెట్టడం మంచిది. ఒక విద్యార్ధి చెడిన బాగుపడినా అతని స్నేహితుల పాత్ర ఎక్కువగా ఉంటుంది కనుక, ఈ జాగ్రత్తలను పాటించండి.

ఈ వ్యాసాల పయిన మీ సూచనలను అభిప్రాయాలను, admin@andhrafunda.com కు పంపండి. ఈ వ్యాసాలను మీకు సమర్పించిన వారు – http://www.andhrafunda.com

పేరు గొప్ప ఊరు దిబ్బ
ఇది కోస్తా ప్రాంతం లోనే పెద్ద పేరుగాంచిన విద్యాసంస్థల కథ. కళాశాల స్థాపించి 25 సంవత్సరాలు గడుస్తున్నాయి కాని, ఇక్కడ విద్యాబోధనకు ఉపయోగించే విధానాలు మాత్రము కళాశాల స్థాపించినప్పటివా అన్నట్టుగా ఉన్నాయి. పిల్లలకు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో., ఏ విషయంలో మంచి పరిజ్ఞానం ఉన్నదో, ఆ విషయం లో అతనికి మరింత పోదును పెట్టి పయికి ఎదిగే విధముగా చేయటం మానివేసి కేవలం పుస్తకాలలోని చదువుకు బంధీని చేసి, విద్యార్ధి సృజనాత్మకతను పాతిపెట్టేస్తోంది ఈ విద్యాసంస్థ.

ప్రజల సౌకర్యార్ధమై ఒక కొత్త పరికరాన్ని కనుగొన్న విద్యార్ధి ని ఆ కళాశాల ప్రిన్సిపాల్ , విద్యార్ధి ఆ పరికరం మీద పని చేసినందుకు గాను రెండు రోజులు సెలవు ఇవ్వమని కోరగా,  తిట్టడమే కాక, ఎవర్ని అడిగి చేసావు, ఎందుకు చేసావు, ఎం ప్రయోజనం నీకు అంటూ తన అబ్యార్దనను కొట్టిపారేశాడు. పోనీ ప్రిన్సిపాల్ ఎమన్నా తక్కువ చదువు చదివి సంస్కారం లేని వాడా అంటే, అదీ కాదు, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఐ ఐ టి ఖరగ్పూర్ లో మెకానికాల్ ఇంజినీరు పట్టా పొందారు. పోనీ ఆ పరికరము తయారీకి ఏదైనా కాలేజీ ఆస్తిని వినియోగించాడ పిల్లవాడు అని చుస్తే అదీ లేదు. అంతా తన సొంత తెలివి తేటలతో, తన సొంత డబ్బులతో, తనకున్న స్తోమతతో, దానిని తాయారు చేసాడు. అలంటి అద్భుతమైనటువంటి పిల్లలను చేరదీసి, వారికి తగిన శిక్షణతో పదును పెట్టడం మానేసి మాటలతో క్రున్గదీయడమేనా ఒక అధ్యాపకుడి భాద్యతా?

చాలా కళాశాలలో, మొదటి సంవత్సరం విద్యార్ధులను, మిగతా సంవత్సరపు విద్యార్ధులతో కలవనివ్వకుండా సైన్సు అండ్ హుమానిటీస్ పేరుతో వేరు చేసి ఉంచుతారు. వీళ్ళను ఈ సంస్కృతిక కార్యక్రమాలలోకాని, కాలేజీ స్పోర్ట్సు మీట్ లో కాని పాల్గొననివ్వరు. అదేమిటి అని ప్రశ్నించగా,  ర్యాగింగ్ ని అరికట్టడానికి అని సర్దిచేప్పుతారు. ర్యాగింగ్ పేరుతో విద్యార్ధి స్వేచ్ఛను కాలరాయడం ఎంతవరకు సమంజసం? ఫస్ట్ ఇయర్ కుర్రాడు అంటే కేవలం పుస్తకాలకే అన్కితమవ్వాలా? అతనిలో సృజనాత్మకత ఉండదా?

ఎంతో పేరు గాంచిన , చరిత్ర కలిగిన కళాశాలలో పరిస్తితే ఇలా ఉంటె, నిన్న మొన్న పెట్టిన కలాసాలల పరిస్థితి ఏంటి? కొన్ని కలసలలలో కనీస వసతులు, లాబోరతరీలు, కంపూటర్లు, కనీసం సరిపడా తరగతి గదులు కూడా లేకుండా కళాశాలలు స్థాపిస్తున్నారు. అవి ఎవరి ప్రయోజనార్ధం కోసం? అసలు సాంకేతిక విద్య అనే పదానికి అవి ఎంత మాత్రం పోలిక కలిగి ఉన్నాయి?

ఇటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని  విద్యార్ధులకు, వారు తల్లి దండ్రులు కొన్ని సూచనలు చేయ దల్చుకున్నాము :

1 . కేవలం కళాశాల స్థాపించిన సంవత్సరాన్ని ఆదరంగా చేసుకునో, లేక కళాశాల వైశాల్యాన్ని చుసుకునో, భవనాలను చుసుకునో, దయ చేసి ఆ కాలేజీ, మంచిది అనే నిర్ణయానికి రాకండి.

2 . కళాశాల గురించి అక్కడ చదివే విద్యార్ధులను (ప్రత్యేకముగా ఫైనల్ ఇయర్ వాళ్ళని కాకుండా థర్డ్ ఇయర్ వాళ్ళని అడగడం మంచిది) అడిగి మంచి చెడులను చర్చించండి. రెండవ సంవత్సర విద్యార్ధులకు కళాశాల, అక్కడి విద్య, బయటి కళాశాలలు, అందులోని విద్య ప్రమాణాల పట్ల సాధారణముగా అవగాన లోపిస్తుంది. ఫైనల్ ఇయర్ విద్యార్ధులు కళాశాల ని మరి కొన్ని రోజులలో విడిచి వెళ్ళిపోతారు మరియు, వారు కళాశాలలో ప్రవేశించి నాలుగు సంవత్సరములు గడిచి ఉంటాయి కనుకు, వారికి ఈ కాలపు ట్రెండ్స్ మీద ఐడియా ఉండదు. కనుక థర్డ్ ఇయర్ వారిని సంప్రదించటం మెరుగు.

3 . బ్రాంచి ఎన్నుకునేటప్పుడు తల్లిదండ్రులు తమ తమ ఇష్టాలను పిల్లలపై రుద్దకుండా, విద్యార్ధికి ఏది ఇష్టమో అందులో చేర్పించండి. ఒక వేల విద్యార్ధికి అవగాన తక్కువ అయినట్లయితే, మీరే మీ పిల్లలకు ఇంజనీరింగ్ లోని ప్రతి బ్రాంచిలో వేటికి సంబందించిన పాటాలు ఉంటాయో .. ఆయా బ్రాంచిలు ఎటువంటి ఉద్యోగావకాసాలకు  దారి తీస్తాయో వివరించి చెప్పాలి. అప్పుడే విద్యార్ధి తాను తీసుకునే బ్రాంచిని ఇష్టం తో నేర్చుకుంటాడు.

4  . బ్రాంచి సెలక్షన్ లో మరొక ముఖ్య అంశమేమిటి అంటే, ఏదో ఈ సి ఈ కి మంచి డిమాండ్ ఉంది అంట. మన పిల్లల్ని అందులోనే చేర్చుదము అనుకోకండి. ప్రతి బ్రాంచి కి దానికి ఉండవలసిన ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక మంచి ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి అన్ని ఎంగిన్నేరింగ్ విభాగాల నిపుణులు అవసరమవుతారు అని మరువకండి.

ఒక వేల మీకు మరిన్ని విషయాలు తెలిసి ఉంటె కింద కామెంట్ చెయ్యండి.. బ్రాంచి మరియు కాలీజీ సెలక్షన్ లో విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు సహాయపడండి.

ధన్యవాదములు.